టర్కీలో భూకంపం వల్ల భారీగా ప్రాణ..ఆస్తి నష్టం సంభవించినందుకు చింతిస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని అన్నారు. టర్కీ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందనీ, ఈ విషాద సమయంలో వారికి అండగా అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.భూకంపం వల్ల టర్కీలో 912 మంది మృతిచెందగా.. సిరియాలో 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్క టర్కీలోనే దాదాపు 2,828 బిల్డింగ్లు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ దేశంలో ప్రాణ నష్టం ఎంతగా ఉంటుందో అంచనా వేయవచ్చు.లెవల్ ఫోర్ అప్రమత్తతను టర్కీ ప్రకటించింది. అంతర్జాతీయ దేశాల సహాయాన్ని కోరారు టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్. సిరియాలోని అలెప్పొ, హమా, లటాకియా, టార్టస్ ప్రాంతాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది ఇప్పుడిప్పుడు అక్కడ జరిగిన బీభత్సానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement