Thursday, November 21, 2024

మేడారం జాత‌ర‌కు జాతీయ‌స్థాయి గుర్తింపుకోసం య‌త్నిస్తాం – మంత్రి ఎర్ర‌బెల్లి

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మేడారంలో మీడియాతో మాట్లాడారు. మేడారం జాత‌ర‌కు జాతీయ‌స్థాయి గుర్తింపుకోసం ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. మేడారం మహాజాతరపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారన్నారు. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కావడం విశేషమన్నారు. అమ్మవార్ల ఆశీర్వాదంతో కేసీఆర్ నేష‌న‌ల్ పొలిటిక్స్ లో రాణించాలని మొక్కుకున్నానని తెలిపారు. ఈ యేడాది జాతరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పూజారులు, ఆదివాసి సంఘాలు సహకారం అందిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. మేడారం జాత‌ర‌కు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో helicopterసేవలు ప్రారంభం కానున్నాయని ఫిబ్రవరి 15న ప్రకటించారు. Hanumakonda Arts College మైదానం నుంచి జాతరకు హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈనెల మేడారం వెళ్లలేని భక్తులు కూడా మొక్కులు చెల్లించే అవకాశం ఉంది. కొరియ‌ర్ ద్వారా ప్రసాదం ఇంటిదగ్గరికే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవలో రూ.225 చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదం పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement