మెగాస్టార్ చిరంజీవే సినీ పెద్దని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిలిం జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయంపై ఎడతెరగని చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో ఐకమత్యం లేకపోవడంతో పెద్దతనాన్ని స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే మెగాస్టార్ చిరంజీవే పెద్ద దిక్కు అని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే చెప్పారు. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇస్తూ… తాను కేవలం సినిమా బిడ్డను మాత్రమేనని… ఇండస్ట్రీకి పెద్ద దిక్కును కాదని స్పష్టం చేశారు.
ఫిల్మ్ జర్నలిస్టులకు అండగా ఉంటాం – పరిశ్రమకి పెద్ద చిరంజీవే – మంత్రి తలసాని
Advertisement
తాజా వార్తలు
Advertisement