Tuesday, November 26, 2024

మూడు రాజధానుల బిల్లు మళ్ళీ పెడతాం – మంత్రి బొత్స‌

సీఆర్డీయే చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ చేసిన చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం గ‌తంలోనే వెన‌క్కి తీసుకుంద‌ని ..అంటే సీఆర్డీయే చట్టాన్ని అమలు చేస్తామనే అర్థం కదా… కోర్టు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏముంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు అనే విధానానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. చట్టాలు చేయటానికే శాసనసభ, పార్లమెంటు ఉన్నాయన్నారు. చట్ట సభలకు చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది అనే విషయాన్ని నేను నమ్మటం లేదని.. చెప్పేవాడికి చేసే వాడు లోకువ అని చురకలు అంటించారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుంది.. మేమే చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా తీర్పు ఏంటి,, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఊహించిన తీర్పేనని.. టీడీపీ కి సమాజ అభివృద్ధి కంటే ఒక సామాజిక వర్గ అభివృద్ధి కావాలన్నారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే టీడీపీ విధానమని.. మూడు రాజధానుల బిల్లు మళ్ళీ పెడతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement