భారత ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాల లేఖ రాశారు. వార్ కారణంగా ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన 20వేల మంది విద్యార్థుల చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు కేసీఆర్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏడు వందల మంది విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు.
ఆ స్టూడెంట్స్ చదువు ఖర్చంతా భరిస్తాం.. సానుకూలంగా స్పందించాలే: మోడీకి కేసీఆర్ లేఖ
Advertisement
తాజా వార్తలు
Advertisement