Thursday, November 21, 2024

Big Breaking | మాట ఇస్తే తప్పేవాళ్లం కాదు.. ఆదరించండి, అభివృద్ధి చేస్తాం: రాహుల్​ గాంధీ

తెలంగాణ విషయంలో కాంగ్రెస్​ ముఖ్య నేత సోనియాగాంధీ ఎలా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే విధంగా ఆరు హామీలను అమలు చేస్తాం అన్నారు పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ. ఇవ్వాల (ఆదివారం) జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పథకాలను తెలియజేస్తూనే.. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేసిన​ అవినీతిని, ఇక్కడినేతల అవినీతిపై విమర్శలు గుప్పించారు. రాహుల్​ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే…

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వారి గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ కేవలం బీఆర్​ఎస్​తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్​ పార్టీ బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తోంది. ఇవన్నీ వేర్వేరు పార్టీలుగా కనిపించినా, తెలంగాణలో అన్నీ కలిసిపోయాయి. నేను లోక్​సభలో బీఆర్​ఎస్​ ఎంపీలను చూశాను. పార్లమెంట్లో బీజేపీపి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్​ఎస్​ ఎంపీలు మద్దతు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్​ఎస్​ బీజేపీకి మద్దతు తెలిపింది. జీఎస్టీకి సపోర్టు ఇచ్చింది. ఎప్పుడూ బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీజేపీకి బీఆర్​ఎస్​ సపోర్టుగా నిలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్​ మీటింగ్​ పెట్టామని వాళ్లు ముగ్గురు కూడా వేర్వేరేరు మీటింగ్​లు పెట్టాయి.

కానీ, తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంది. ఎవరూ డిస్టర్బ్​ చేయలేరు. కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉందన్న విషయం మీరు గమనించాలి. ఇంకొక విషయం దయచేసి గమనించాలి. ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉంది. ఈడీ, సీబీఐ, ఇన్​కమ్​ ట్యాక్స్​ వంటివన్నీ విపక్ష నేతలపై ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్​పై బీజేపీ వారు ఏ ఒక్క కేసు పెట్టలేదు.  ఎంఐఎం నాయకులపై కూడా ఏ కేసు లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకే కేసీఆర్​, ఎంఐఎం నేతలపై కేసులు లేవు. మోదీ వీళ్లిద్దరినీ తన మనుషులుగా భావిస్తున్నారు కాబట్టే ఎట్లాంటి కేసులు పెట్టలేదు. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా వీరిపైన కేసులు ఏవు. ఇవ్వాల సోనియా గాంధీ గారి స్పీచ్​ వింటున్నాను. సోనియా గాంధీ గారు మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు.

- Advertisement -

ఏమి జరిగినా, ఎంత నష్టపోయినా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 2012లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలోచిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారు. మీ కల, మీ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే దక్కుతున్నాయి. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్​ కుటుంబానికి ఇవ్వలేదు. వారి లాభాల కోసం ఇవ్వలేదు. పేదల కోసం, రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేశాం.

కానీ, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. మేము అప్పడు తెలంగాణ విషయంలో గ్యారెంటీ ఇచ్చాం.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే గ్యారెంటీ ఇస్తున్నాం.. సోనియా మాటలు నమ్మండి.. ఆదరించండి అని రాహుల్​ గాధీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement