Tuesday, November 26, 2024

24 గంటల తర్వాత నిర్ణయం తీసుకుంటాం.. నిరసన దీక్ష విజయవంతం: ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన 24 గంటల గడువు వరకూ వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. నిరసన దీక్ష ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో చేపట్టిన ప్రజాప్రతినిధుల దీక్ష విజయవంతమైందని అన్నారు. ఇకనైనా బీజేపీ కళ్లు తెరవాలని సూచించారు. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతిని అవలంభిస్తోందని, రైతుల నడ్డి విడిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్‌లో బీజేపీ దొంగ దీక్ష చేస్తోందని కవిత ఎద్దేవా చేశారు. గతంలో వ‌రిపంట త‌గ్గించాల‌ని తాము రైతులను కోరామని అయితే.. బీజేపీ నేతలు ప్రతి గింజా కొంటామని చెప్పారని గుర్తు చేశారు. ఇది రాజ్యాంగం కాదన్న ఆమె, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పండిన వడ్లన్నీ కొనాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement