ధాన్యానికి సంబంధించి చివరి గింజ కొనేవరకు తమపోరాటం ఆగదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. హైహైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. . ఇప్పటికే తక్కువ ధరలకు వరి అమ్మి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు ఇతర పంటలు వేసి నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. 111 జీవోపై అఖిలపక్ష భేటీ పెట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. 111 జీవో పరిధిలో ఆక్రమణలపై సీబీఐ విచారణ కోరతామని చెప్పారు. అలాగే, మూసీ ప్రక్షాళనపై గవర్నర్‌కు వివరించారు. ఇప్పటికే రైతుల్లో 40శాతం మేర వరి అమ్మకం పూర్తయిందన్నారు..ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, శాంతిభద్రతలపైనా సమీక్షించాలని గవర్నర్ కి వినతి చేశారు. పార్టీ అధ్యక్షుడితో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెళ్లారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement