Saturday, November 23, 2024

ప్ర‌ధాని క్ష‌మాప‌ణ చెప్ప‌డం హుందాత‌నంగా భావిస్తున్నాం.. రైతు కుటుంబాల‌ను ఆదుకోవాలే: నిరంజ‌న్‌రెడ్డి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని ప్ర‌ధాని మోడీ చెప్ప‌డం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. తాము తీసుకున్న నిర్ణ‌యం దేశ ప్ర‌జ‌లకు ఇబ్బందిగా మారింద‌న్న‌ది గుర్తించి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్ప‌డం ఆ ప‌ద‌వికే ఎంతో హుందాత‌నం తెచ్చింద‌న్నారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి.. ఆయ‌న ఏమ‌న్నారంటే..

మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషం. ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవి, కేంద్రం పరువు దక్కేది. రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చింది. అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలి. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నారని మేము అనుకోవడం లేదు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం దేశంలో పలుచబడుతోంది భావించింది. గత నెల రోజుల నుంచి టీఆరెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై పోరాటం చేస్తోంది. అన్నారు

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏంటో మోడీకి తెలుసన్నారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి. మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించింది. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నాం. ఇది ప్రజల విజయంగా భావిస్తున్నాం. కాంగ్రేస్ పార్టీ జాకీలు పెట్టి లేపినా లెవదు. నల్ల రైతు చట్టాలకు పురుడు పోసిందే కాంగ్రేస్ పార్టీ. నల్లచట్టాలకు కాంగ్రెస్ పురుడు పోస్తే.. పెంచిపోషించింది బీజేపీ. సుప్రీంకోర్టులో ఆకలి కేకలు ఇంకా ఉన్నాయని చెప్తోంది. దేశంలో వస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అన్నారు.

శాంతకుమారి కమిటీ నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు వ్య‌వ‌సాయ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి. దేశంలో ఆహార ఉత్పత్తులను రెగ్యులేట్ చేయడం కేంద్రానికి చేతకాకపోవడం దురదృష్టకరం. కార్పొరేట్ రంగాలపై ఎక్కువ మక్కువ చూపడం వల్లే ఇవ్వాళ ఈ సంక్షోభం వచ్చింది. దేశవ్యాప్తంగా పంటల కాలనీలను ఏర్పాటు చేయాలి. 6లక్షల కోట్లు బ్యాంక్ లకు కార్పొరేట్లు ఎగపెడితే కేంద్రం మాఫీ చెయ్యలేదా? పంటలు వేయొద్దు అంటే ప్రజల ఉపాధి కోల్పోఎందుకు మొదటి అడుగు వేసినట్టే. పంట కొనుగోళ్లను ఆర్థికకోణంలో చూడొద్దు.. సామాజిక కోణంలో చూడాలి. తెలంగాణలో అతి ఎక్కువ విస్తారంలో పంటలు వస్తాయి. స్టాక్స్ ఎక్కువ అయితే పంటను కొనరా? ప్రత్యామ్నాయ ఆలోచన చెయ్యదా కేంద్రం? అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement