Tuesday, November 19, 2024

చైనా కుయుక్తులకు గట్టిగానే బుద్ధి చెబుతాం.. ఆర్మీ చీఫ్ నరవణె

భారత సైన్యం తూర్పు లడఖ్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో కఠినంగానే వ్యవహరిస్తోందని, ఈ ప్రాంతంలో హై లెవల్ లో బలగాలను మోహరించినట్టు ఆర్మీ చీఫ్ జనరల్ M.M. నరవణే చెప్పారు. ఆర్మీ డేకి ముందు జరిగిన మీడియా మీట్ లో జనరల్ నరవాణె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పాక్షికంగా ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఏ విధంగానూ ముప్పు తగ్గలేదన్నారు.దీంతో అత్యున్నత స్థాయి కార్యాచరణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో చైనీస్ PLAతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. చైనా యొక్క కొత్త భూ సరిహద్దు చట్టంతో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడానికి భారత సైన్యం తగినంతగా సిద్ధంగా ఉందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ చెప్పారు.

సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి చేయడం గురించి కూడా ప్రస్తావించారు ఆర్మీ చీఫ్ నరవణె సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని ద్వంద్వ-వినియోగ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేలా చూడడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు బలగాల ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉందని చెప్పారు. కాగా, డిసెంబర్ 4న నాగాలాండ్ కాల్పుల ఘటనపై ఒకటి, రెండు రోజుల్లో నివేదిక అందుతుందని, దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని జనరల్ నరవానే చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement