2023తమకు విజయ సంవత్సరం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుదు వొలోదిమిర్ జెలెన్ స్కీ. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలుపెట్టి నేటికి ఏడాది అయింది. రెండు వైపులా లక్ష మందికి పైగా చనిపోయారు. ఊర్లకు ఊర్లు నేలమట్టమై ఉక్రెయిన్ శిథిలమైంది. ఆర్థిక ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. ఇంకా యుద్ధం ముగియలేదు. రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు.ఈ నేపథ్యంలో జెలన్ స్కీ .. తన దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు.ఫిబ్రవరి 24న మనలోని లక్షలాది మంది.. ఒక దారిని ఎంచుకున్నారు. తెల్ల జెండాని కాదు.. నీలం, పసుపు రంగు జెండాని ఎంపిక చేసుకున్నాం. పారిపోలేదు.. ఎదుర్కొంటున్నాం, ప్రతిఘటిస్తున్నాం, పోరాడుతున్నాం. ఇది బాధ, దుఃఖం, విశ్వాసం, ఐక్యతా సంవత్సరం. మనం అజేయంగా ఉన్న సంవత్సరం. 2023 మన విజయ సంవత్సరమని మనకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. మరో వీడియోను షేర్ చేసిన జెలెన్ స్కీ.. ఏడాది కిందట ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్నిగుర్తు చేసుకున్నారు. సంవత్సరం క్రితం ఇదే రోజున, ఇదే స్థలం నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రసంగించాను. అది కూడా కేవలం 67 సెకన్లు మాత్రమేనని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement