గత పాలకుల హయాంలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేళ్లలో చేసి చూపామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి ఇలా ఏదో ఒక పథకంలో లబ్ధి జరిగిందన్నారు. ముసలవ్వలను అడగాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెన్షన్ వచ్చిందని ప్రస్తుతం కేసీఆర్ పాలనలో ఎంత వస్తుందని అడగాలన్నారు. గతంలో రూ.200లను పింఛన్లు 2016కు పెంచిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాటలు చెబుతారని, పనులు చేయరని తమ నాయకుడు కేసీఆర్ పనిచేసే నాయకుడన్నారు.
50ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేళ్లలో చేసి చూపాం.. మంత్రి కేటీఆర్
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement