Friday, November 22, 2024

Patna Meet | బీజేపీని ఐక్యంగా ఎదుర్కొంటాం.. విపక్షాల భేటీ తర్వాత నితీశ్​కుమార్​ వెల్లడి

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిగా పోటీ చేస్తాయని బిహార్ సీఎం, జనతాదళ్-యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ చెప్పారు. ఇవ్వాల (శుక్రవారం) పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడారు. కలిసి ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు నితీశ్​ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల మెగా మీటింగ్‌ను ఏర్పాటు చేసిన నితీశ్​కుమార్.. త్వరలో మరో విపక్షాల భేటీ ఉంటుందన్నారు.

ఇది మంచి సమావేశం, ఇక్కడ కలిసి ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నాం. త్వరలో మరో సమావేశం జరగనుంది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ సహా ఇతర ప్రతిపక్ష నేతల సమక్షంలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నితీశ్​ కుమార్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరును కూడా ఆయన దుయ్యబట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం ఈ సమావేశం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement