Saturday, November 23, 2024

Big Story: గంజాయి, ఓపియం సాగు చేస్తాం.. వేరే ఆప్ష‌న్ లేదంటున్న రైతులు..

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అక్కడి రైతులు యథేచ్చగా గంజాయి, ఓపియం పోపీ (Opium poppy) పంటను సాగు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఆఫ్గ‌నిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తొలినాళ్లలో ఓపియం సాగును నిషేధిస్తామని తాలిబన్ (Taliban) పాలకులు ప్రకటించారు.

కానీ, ఇప్పటికీ ఓపియం సాగును నిషేధించలేకపోయారు. వివిధ మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే ఓపియం సాగు అక్కడి రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. తాలిబన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం, ఆహార సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో… అనివార్య పరిస్థితుల్లో తాము ఈ పంట‌ల‌ను కొనసాగించక తప్పట్లేదని రైతులు వాపోతున్నారు.

ఆఫ్గనిస్తాన్‌కు (Afghanistan) చెందిన రైతు అబా వలీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పరిస్థితి గురించి వివరించారు. ‘మేము మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓపియం సాగుచేస్తున్నాం. ఈ పంట‌ సాగుతోనే మాకు తిండి దొరుకుతోంది. మాకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. వేరే పంటలు పండించేందుకు అవసరమైన నీటి సదుపాయం ఇక్కడ లేదు. కాబట్టి ఓపియం సాగు మాత్రమే మా ముందున్న ఏకైక ఆప్షన్.’ అని వలీ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

www.twitter.com/AndhraPrabhaApp, www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement