Tuesday, November 26, 2024

ఆర్వో బదిలీపై ఈసీ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

నిబంధనల మేరకు పనిచేసిన మునుగోడు రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు ఆర్వో బదిలీపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్వో బదిలీ వ్యవహరంలో కేంద్రం ఎన్నికల సంఘం తీరు ఆక్షేపనీయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

2011లోనే సస్పెండ్ చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి పెట్టడమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంలో పనిచేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. మునుగోడులో ఓటమి తప్పదనే బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement