సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయనడం కరెక్ట్ కాదని, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. ఇవ్వాల రాత్రి ఓ టీవీ చానల్ డిబేట్లో బాగంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు. కావాలనే ఇట్లాంటి తప్పుడు ప్రాపగాండా చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఫండ్స్ రిలీజ్ చేసి డెవలప్ చేస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్.
రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలకు అయినా వెళ్లి పరిశీలిద్దాం.. లేకుంటే ఏ మున్సిపాలిటీకి వెళ్లి అయినా పరిశీలిద్దాం డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది తెలుసుకుందాం అన్నారు మంత్రి కేటీఆర్. తాము ఫండ్స్ ఇవ్వందే సిరిసిల్లతో సమానంగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీకి కేంద్రం స్వచ్ఛ్ అవార్డు ఎట్లా వస్తుందని ప్రశ్నించారు కేటీఆర్.