ఎస్కలేటర్ ని నిర్లక్ష్యంగా వాడటంతో ఒకరు మృతి చెందారు. ఎస్కలేటర్స్ అనేవి షాపింగ్ మాల్స్ , ఎయిర్ పోర్టు , రైల్వే స్టేషన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తే మన శ్రమను ఎంతో తగ్గిస్తాయి. కానీ కేర్ లెస్ గా ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ‘రెడ్డిట్’ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు స్త్రీలు తమ సూట్ కేసులను పట్టుకొని నడుస్తుంటారు. అయితే ఎస్కలేటర్ కు దగ్గరికి చేరుకుని తమ సూట్ కేసులను దానిపై వదిలిపెడతారు. దీంతో అది కిందకి వెళ్తుంది. కొంత దూరం వెళ్లిన తరువాత అది బోర్లా పడుతూ వేగంగా కిందికి జారుతుంది. అదే సమయంలో కింద ఓ మహిళ ఎస్కలేటర్ పై వెళ్తూ ఉంటుంది. ఈ సూట్ కేసు పై నుంచి వేగంగా రావడం చూసిన ఆమె దాని నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తాలని ప్రయత్నిస్తుంది. కానీ అత్యంత వేగంగా వచ్చిన ఆ సూట్ కేసు ఆమె కాళ్లను బలంగా తాకుతుంది. దీంతో ఆమె కాళ్లు బ్యాలెన్స్ కోల్పొయి పైకి లేచి కిందపడుతుంది. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంటుంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు ‘రెడ్డిట్’లో వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement