Tuesday, November 26, 2024

వాట‌ర్ ట్యాంక్ లో కోటి రూపాయ‌లు – త‌డిసిన న‌గ‌దు – ఐటీ అధికారులు ఏం చేశారంటే

ఓ వ్యాపార‌వేత్త ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో వారికి వాట‌ర్ ట్యాంక్ లో కోటి రూపాయ‌ల న‌గ‌దు దొరికింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. వ్యాపార‌వేత్త శంక‌ర్ రాయ్ ఇంటి నుండి రూ.8కోట్ల లెక్క చూప‌ని న‌గ‌దుని స్వాధీనం చేసుకున్న‌ట్లు ఐటీ అధికారులు చెప్పారు. అండ‌ర్ గ్రౌండ్ వాట‌ర్ ట్యాంక్ లో దాచిన బ్యాగులో కోటి రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. శంకర్ రాయ్ ఇంటి నుండి రూ. 5 కోట్ల విలువైన నగదు కూడా స్వాధీనం చేసకున్నామని అధికారులు తెలిపారు. రాయ్ ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్న నగదుతో పాటు మూడు కిలోల బంగారం కూడా ఉందని ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ చెప్పారు.జబల్‌పూర్ ఆదాయపన్ను శాఖాధికారులు ఈ దాడులు నిర్వహించారు.

రాయ్ గతంలో కాంగ్రెస్ మద్దతుతో దమోహ్ నగర్ మున్సిపల్ చైర్మెన్ గా పనిచేశారు. రాయ్ సోదరుడు కమల్ రాయ్ గతంలో బిజెపి మద్దతుతో మున్సిపల్ ఛైర్మెన్ గా పనిచేశారు. తెల్లవారుజాము ఐదు గంటల నుండి సుమారు 39 గంటల పాటు ఐటీ అధికారులు శంకర్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. రాయ్ కి సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాయ్ కుటుంబం ఉద్యోగుల పేరుతో మూడు డజన్ల బస్సులను నడుపుతుందని కూడా ఆదాయ పన్ను శాఖాధికారులు చెప్పారు. శంకర్ రాయ్ కుటుంబానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరే ప్రాంతంలోనైనా సమాచారం ఇస్తే రూ. 10 వేల రివార్డును ఇస్తామని ఐటీ శాఖాధికారులు చెప్పారు. శంకర్ రాయ్ ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్న కీలకమైన డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తును చేస్తామని ఆదాయపన్ను శాఖాధికారులు తెలిపారు.

ఇప్పటివరకు స్వాధీనం చేసుకొన్న పత్రాలు , ఆస్తులపై పేరులేకుండా ఉన్న విషయాన్ని కూడాగుర్తించినట్టుగా ఆదాయపన్ను శాఖాధికారులు చెప్పారు. అయితే ఈ పేరులేని ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నాయనే విషయమై కూడా దర్యాప్తు చేస్తామని తెలిపారు. వాటర్ ట్యాంక్ లో దాచిన బ్యాగులో కోటి రూపాయాలు నీటిలో తడిచిపోయాయి. ఈ నగదును ఐటీ శాఖాధికారులు హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టారు. అ ఆర్వాత ఐరన్ బాక్స్ తో నగదును తడి లేకుండా చేశారు. ఈ దృశ్యాలను ఐటీ అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement