ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి ట్రాక్ దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి.. అనుకోకుండా రైలు కదలడంతో ఉం చేశాడన్నది ఈ వీడియోలో ఉంది. ఇక.. కదులుతున్న రైలు కింద నుంచి తనను తాను రక్షించుకోవడానికి అతనేం చేశాడో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అంతా చనిపోయాడు అనుకున్నారు. కానీ, రైలు వెళ్లిన తర్వాత హ్యాపీగా నడుచుకుంటూ బయటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బీహార్ లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. రైలు కింద నుంచి వేరే ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. కానీ, అది కదలడం ప్రారంభించడంతో అతను దాని కింద చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తూ అతను క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది వెన్నులో వణుకు పుట్టించింది. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వీడియో ప్రారంభం కాగానే ఒక గూడ్స్ రైలు అతని మీదుగా వెళుతుండగా.. ఒక వ్యక్తి పట్టాలపై పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల గుమిగూడిన ప్రజలు ఆ వ్యక్తి ప్రాణాల గురించి ఆందోళనతో ఊపిరి పీల్చుకుని చూస్తున్నారు. లేవవద్దని, కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరిస్తున్నారు. కానీ, రైలు పూర్తిగా అతని మీదుగా వెళుతుంది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి లేచి తన బ్యాక్‌ప్యాక్‌తో అక్కడి నుండి బయలుదేరాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అతను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లకుండా “షార్ట్ కట్” తీసుకోవాలని అనుకున్నాడు. రైలు కింద నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నాడు. రైలు కిందకి వెళ్లగానే రైలు కదలడంతో పట్టాలపై ఇరుక్కుపోయాడు. ఈ వీడియో క్లిప్‌ను చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు.