వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది రోలెక్స్ కంపెనీకి చెందిన ఓ వాచ్. 1964లో సుమారు ఏడు వేల ఖరీదు చేసిన ఆ వాచ్ ని .. బ్రిటన్‌లో వేలం వేశారు. ఆ వేలంలో 41లక్షలకు ఆ వాచీ అమ్ముడుపోయింది. రోలెక్స్ సబ్‌మారినర్ మోడల్‌కు చెందిన ఈ వాచీని ద డ్రైవర్స్ వాచీ అని కూడా పిలుస్తారు. దీన్ని 1953లో లాంచ్ చేశారు. ఇది వాటర్‌ప్రూఫ్ కూడా. రాయల్ నేవీలోని రెస్క్యూ హెలికాప్టర్లలో పనిచేసే సైమన్ బార్నెట్ డ్రైవర్ తొలుత దీన్ని కొన్నారు. ఆయన 2019లో మరణించారు. ఆయన కుమారుడు పీట్ బార్నెట్ ఈ వాచీని వేలంలో అమ్మారు. నేవీలో పనిచేసిన తన తండ్రి డైవింగ్ సమయంలో ఈ వాచీని వాడినట్లు చెప్పాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement