Tuesday, November 26, 2024

Warangal – బిజెపి ఆశావాహుల‌లో టెన్ష‌న్…. టెన్ష‌న్…

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఎన్నికల కదన రంగంలోకి అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకపోతున్నారు. నెల రోజుల క్రితమే బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మం త్రి కేసీఆర్‌ తమ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడమే కాకుండా బీ-ఫామ్‌లను అభ్య ర్థు లకు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ మొదటి జాబి తాను విడుదల చేసి ఉమ్మడి జిల్లాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకునే భారతీయ జన ³తా పార్టీ ఇప్పటి వరకు తమ పార్టీ నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఏఏ నియోజకవ ర్గా లలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో… గెలుపు గుర్రాలు ఎవరు? అనే జాబితాను విడుదల చేయ డంలో మరింతగా జాప్యం చేయడంతో ఆశా వ హులు నిరాశ, నిస్ప్రహలతో ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం నియోజకవర్గాలలో ప్రచారాన్ని ప్రారంభించ లేదు. పోటీ ఉంటూ టికెట్‌ తమకే వస్తుందనే ధీమాతో ఉన్న నాయకులు మాత్రమే ప్రజా క్షేత్రంలో ప్రచారం చేసుకుంటున్నారు. అ యితే దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి ప్రజా దరణ చూసి చాలా మంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. ఆయా నియోజకవ ర్గా లలో ఉన్నటువంటి ఆశావహులందరూ దర ఖాస్తు చేసుకోవాలని పార్టీ అధిష్టానం చెప్పడంతో భారీగానే దర ఖాస్తులు వచ్చాయి. ఆశా వహుల మధ్య పోటీ బాగానే ఉంది. జనరల్‌ నియోజక వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ నియో జక వర్గాలలో కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగా నే ఉండ డంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొంత ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలో బీజేపీకి కొంత ఆదరణ ఎక్కువగానే ఉంది. దీని తో అభ్య ర్థుల పోటీ కూడా ఎక్కువ గా నే ఉండ డంతో ఎవరిని ఎంపిక చేయాలనే తర్జన భర్జన కమల నాయకత్వానికి తలనొప్పిగా మా రింది.

పోటీపడుతున్న ఆశావహులు
గతం కన్నా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు బాగానే పోటీపడుతున్నారు. 2018 అసెంబ్లిd ఎన్నికల తరువాత తెలంగాణపై కమల నాయకత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. అసెం బ్లిd ఎన్నికలు కాగానే జిహెచ్‌ఎంసి ఎన్నికలు రావ డం, ఆ ఎన్నికలలో బీజేపీ నాయకత్వం గట్టిగానే పోటీ పడింది. ఆ తరువాత వరంగల్‌ నగర పాలక సంస్థ ఎన్నికలలో కూడా బీజేపీ గట్టిగానే పోరాడింది. ఒకప్పుడు వరంగల్‌ మేయర్‌ స్థానాన్ని కైవసం చేసు కున్న బీజేపీ తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఒకే ఒక్క కార్పోరేటర్‌ స్థానాన్ని కైవసం చేసు కుం ది. కానీ 2020లో జరిగినటువంటి గ్రేటర్‌ ఎన్ని కలలో బీజేపీ గట్టిగానే పోరాడింది. ఒకటి నుంచి ఎనిమిది స్థానాల వరకు సాధించు కోగలిగింది. గ్రేటర్‌పై కొంత పట్టు పెరిగింది. విశేషం ఏమిటంటే వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్థ న్నపేట మూడు అసెంబ్లిd నియోజకవర్గాల పరి ధిలో కార్పోరేటర్లను గెలుచుకుంది. అయితే గ్రా మ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం న రుగా నిధులను కేటాయిస్తోంది.

బీజేపీ నాయకత్వం సైతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి తమ క్యాడర్‌ ద్వారా గ్రామ పంచాయతీల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా కేటాయిస్తుందనే ప్రచారాన్ని కేత్ర స్థా యిలో తీసుకుపోవడం కోసం కమల నాయ క త్వం ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రామ పంచా య తీల నిధులు ఎక్కువగా కేంద్రం నుంచే వసు ్తన్నా యనే విషయాన్ని ప్రజలకు చేర్చడంలో కమల నాయకత్వం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో కొంత ఓటు బ్యాంకు పెరగడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్నటువంటి అన్నినియోజకవర్గాల పోటీకి క మల నేతలు సై అంటున్నారు. ప్రతి నియోజక వ ర్గంలో మూడుకు తగ్గకుండా ఏడెనిమిది మం దికి పైగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మూడు సా ర్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లో ఉంటే రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశం తో బీజేపీకి రాజీనామా చేశారు. రేవూరి రాజీనామా బీజేపీకి పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం ముందుచూపుతో అభ్యర్థులను ప్రకటించి టికెట్లు రానివాళ్లకు సముచిత స్థానం కల్పిస్తామనే భరో సాను ఇచ్చారు. స్టేషన్‌ఘనపూర్‌, జనగామ నియోజక వర్గంలో అభ్యర్థి మార్పుతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతానికి భిన్నంగా పోటీకి నిలబడేవారంతా టికెట్ల కోసం దరఖాస్తు చేసు కోవాలంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 60కి పైగా దరఖాస్తులు వచ్చాయి. టికెట్‌ ప్రకటిస్తే గందగోళ వాతావరణం ఏర్పడుతుందనే భయ ంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ఈసారి పోటీలో ఉంటామంటూ బీజేపీ నాయకులు మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తే చాలా మంది పార్టీ మారే అవకాశాలుంటాయని జోరుగా చర్చ సాగుతోంది. ఆలస్యమవుతున్న కొద్దీ పోటీ చేసే వారి స ంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement