ఉక్రెయిన్ – రష్యా యుద్ధ ప్రభావం భారత్ పై పడుతోంది. ఈరోజు ఉదయం నుంచి రష్యా ఉక్రెయిన్ పై దాడిచేస్తూనే ఉండడంతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. అయితే ఈ దాడికి దిగిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో 54,000 రూపాయలు దాటింది. అంటే ఒక్క రోజులోనే బంగారం ధర 3,000 రూపాయలు పెరిగిపోయింది. మల్టీ కెమోడిటీ ఎక్ఛేంజీలో బంగారం ధర గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఇక వెండి ధర కూడా ఇదే స్థాయిలో పెరిగిపోయింది. నిన్నటి వరకూ కిలో వెండి ధర 65 వేల రూపాయలకు దగ్గరగా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో కిలో వెండి 70,000 రూపాయలకు పెరిగిపోయింది. అయితే ఈ ఎఫెక్ట్ ముడి చమురు ధరలపై కూడా పడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా రష్యా ఉండడంతో చమురు ఉత్పత్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటిపోయింది. ఇలా పెరిగిపోవడం ఎనిమిదేళ్లల్లో ఇదే ప్రథమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital