Tuesday, November 26, 2024

Breaking: యుద్ధం ఎఫెక్ట్ : వంద డాలర్లకు పెరిగిన క్రూడాయిల్ ధర

రష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం ప్రారంభించడంతో గురువారం ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరింది. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. గడిచిన ఏడేళ్లలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును తాకింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల 2014వ సంవత్సరం తర్వాత తొలిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరాయి.2014వ సంవత్సరంలో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది.ఈ యుద్ధం వల్ల ఇంధనంతోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నాయి.ఇటీవల కరోనా లాక్ డౌన్ల తర్వాత సంక్షోభం నెలకొంది.ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన రేకెత్తిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement