పోర్నోగ్రఫీ కేసులో తనను బలి పశువుని చేశారని ఆవేదన వెలిబుచ్చాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా. ఆ కేసు నుంచి బయటపడే ఏ అవకాశాన్ని తాను వదులుకోవడం లేదు. ఈ కేసు గురించి తనకు ఏ పాపం తెలియదని.. అన్యాయంగా తనను ఇరికించారని వాదిస్తున్నాడు. ఇప్పటి దాకా తనపై ఉన్న ఎట్లాంటి ఆరోపణలు నిరూపితం కాలేదన్నారు. అందుకే ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వాలని కోర్టును కోరుకున్నారు. పోర్నోగ్రఫీ కేసులో తనకు ఏ పాత్ర లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు రాజ్‌కుంద్రా..
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారి, నిర్మాత అయిన రాజ్ కుంద్రా ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడుతున్న ఎంతోమంది యువతులను పోర్నోగ్రఫీ లోకి దించి పెద్ద ఎత్తున వ్యాపారం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. హీరోయిన్లుగా ఎదగాలని ముంబయికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి పోర్న్ వీడియోలు చేస్తున్నట్టు ఆ మధ్య కేసు నమోదైంది. ఈ విషయంలో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన ఈ నిరాధార కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
తానంటే ఎంటన్నది తెలియని వారి నుంచి వచ్చిన ఫిర్యాదును తీసుకుని.. ఆ కంప్లైట్ ఆధారంగా ఇప్పటి వరకు దర్యాప్తును చేశారని.. కానీ తాను ఎట్లాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనలేదని కోర్టులో తేలిపారు రాజ్‌కుంద్రా. తాను రహస్యంగా ఎటువంటి కంటెంట్ ను సృష్టించలేదని, అడ్వొకేట్ ప్రశాంత్ పాటిల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ లో రాజ్ కుంద్రా పేర్కొన్నారు. తనను బలిపశువును చేసి.. ఇరికించారని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. కోర్టుకు తెలిపారు.
కాగా, చార్జ్ షీటులో కానీ, సప్లిమెంటరీ చార్జ్ షీటులోకానీ ఏ ఒక్క లేడీ కూడా తనను కుంద్రా బెదిరించినట్టు, బలవంతం పెట్టినట్టు, వీడియో తీసినట్టు చెప్పలేదని కోర్ట్ కు గుర్తు చేశారు. పోర్న్ కంటెంట్ అప్ లోడ్ చేయడం.. లేదా తానే స్వయంగా అప్ లోడ్ చేయడం లాంటి వాటిలో.. తాను పాల్గొనలేదని నివేదించారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం హాట్ షాట్స్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీటు పేర్కొంది. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని సంపాదించలేకపోయిందని అంటున్నారు.