Friday, November 22, 2024

అనాథ బాలిక‌ని పెంచుకుందామ‌నుకున్నా – ప్రియాంక‌చోప్రా

అనాథ పిల్ల‌లి ద‌త్త‌త తీసుకోవాల‌నుకున్నాన‌ని తెలిపింది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా..కాగా ప్రియాంక చోప్రా త‌ల్లి మ‌ధు చోప్రా హాస్పిట‌ల్ బ‌య‌ట కార్ పార్కింగ్ లో ఓ అనాథ బాలిక‌ని చూశార‌ట‌. ఆ పాప‌ని ఇంటికి తీసుకువ‌చ్చారు.ఆ పాప‌ని త‌న ద‌గ్గ‌రే ఉంచుకుంటాన‌ని ప్రియాంక తెల‌ప‌గా ..ఒప్పుకోలేద‌ట‌. ఆ పాప‌ని సంతానం లేని దంప‌తుల‌కు అప్ప‌గించార‌ట‌. ఈ మేర‌కు త‌న ఆత్మ‌క‌థ‌లో రాశారు ప్రియాంక‌చోప్రా. కాగా మాతృత్వానికి సంబంధించిన సంతోష‌క‌ర‌మైన క్ష‌ణాల‌కు ప్రియాంక అనుభ‌విస్తోంది. స‌రోగ‌సీ ద్వారా జ‌న‌వ‌రిలో త‌ల్లి అయింది ప్రియాంక‌. ప్రియాంక‌కు పిల్ల‌లంటే చాలా ఇష్టం..సోష‌ల్ మీడియాలో త‌ర‌చు త‌న ఫొటోల‌ని, భ‌ర్త నిక్ జోనాస్ కుటుంబానికి చెందిన పిల్ల‌తో ఆడుకుంటున్న ఫొటోల‌ని షేర్ చేస్తూ వుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement