మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీగా నిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే ఉంది. అయితే ఇటీవలే రిలీజ్ అయిన ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. కానీ, ఈ చిత్రం అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. మెగా ఆభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ క్రమంలో చిరు తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టారు. కాగా.. ప్రస్తుతం చిరు ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ జరుపుతున్నారు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి.
అయితే చిత్రబృందం లేటెస్ట్గా మెగా అభిమానులతో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ప్రెస్మీట్లో భాగంగా దర్శకుడు బాబీ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. ఈ చిత్రానికి గతంలో వాల్తేరు శ్రీను, వాల్తేరు వీరయ్య అనే రెండు టైటిల్స్ లలో ఏదో ఒకటి పెట్టాలని అనుకున్నారు. కాగా చివరికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నారట. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతున్న ఈ సినిమిలో చిరు కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. ఇందులో మాస్‌మహారాజ రవితేజ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెరకెక్కుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..