Saturday, November 23, 2024

వాల్తేరు వీర‌య్య.. హిట్టా.. ఫట్టా

వాల్తేరు వీర‌య్య నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా ఈ రివ్యూతో తెలుసుకుందాం..

క‌థ‌..సాల్మన్ సీజర్ (బాబీ సింహా) అనే డ్రగ్ డాన్ …తనను పట్టుకుని జైల్లో పెట్టిన పోలీస్ లను అందరినీ చంపేసి తప్పించుకుంటాడు. ఆ స్టేషన్ కు హెడ్ గా ఉన్న సీతాపతి(రాజేంద్రప్రసాద్) తన తోటి వాళ్లందరూ చనిపోవటంతో ఆ బాధను తట్టుకోలేక ఆ క్రిమినల్ ని పట్టుకుని శిక్షించాలనుకుంటాడు. అయితే అది తన వల్ల కాదని అందుకు సమర్దుడైన ఓ వ్యక్తి కోసం వెతుకుతూ వాల్తేర్ వీరయ్య దగ్గరకు వచ్చి ఆగుతారు. దాంతో ఆ డ్రగ్ డాన్ పై పగ తీర్చుకోవటం సొంత డబ్బు ఖర్చు పెడటానికి సిద్దపడతాడు. వాల్తేరు వీరయ్య డబ్బు అవసరంలో ఉంటాడు. దాంతో ఆ డీల్ ఒప్పుకుని ఆ డాన్ ని వెతుక్కుంటూ మలేషియా బయిలుదేరతాడు.అక్కడ ఓ హోటల్ లో దిగి అక్కడ పనిచేసే అదితి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క ఆ డ్రగ్స్ డాన్ ని పట్టుకోవటం కోసం కొన్ని ప్లాన్స్ వేస్తాడు. అయితే ఈ క్రమంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు వీరయ్య అక్కడకు వచ్చింది…ఆ డ్రగ్ డాన్ కోసం కాదు అని. ఈలోగా అదితి వీరయ్యకు ఓ షాక్ ఇస్తుంది…అది ఏంటి.. ఎక్కడో వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వీరయ్యకు మలేషియాలో డ్రగ్స్ బిజినెస్ చేసే మైఖేల్ తో పని ఏంటి..అతన్ని ఎందుకు టార్గెట్ చేసాడు.. ఇందులో రవితేజ పాత్ర ఏమిటి..చివరకు వాల్తేరు వీరయ్య అనుకున్నది సాధించాడా… వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ..గాడి తప్పనంతసేపు కమర్షియల్ కథలు స్టార్స్ కు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అందులోనూ ఇలాంటి మాస్ మసాలా సినిమాలు మరీను. చిరంజీవి వంటి మెగాస్టార్ ఇమేజ్ ని మేనేజ్ చేయటం అంటే మామూలు విష‌యం కాదు. స్క్రిప్టులో ఇమేజ్ ని ఎలివేట్ చేసే ప్లేస్ లు ఉండేలా రాసుకోవాలి. అలాగని అవే కనపడి మిగతావి మరుగున పడితే కష్టమనిపిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు మాస్ స్టార్స్ ఉండటం డైరక్టర్ కు పెద్ద ఛాలెంజ్. ఇద్దరికి ప్రాధాన్యత కనపడాలి. ఫ్యాన్స్ నొచ్చుకోకూడదు. అదే అభిమానులు మెచ్చుకునేలా ఎవరి ఎలివేషన్స్ వారికి ఇచ్చేలా కథనాన్ని రాసుకోవాలి. దర్శకుడు,రచయిత అయిన బాబి చాలా వరకూ ఆ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. తెరపై అతని కష్టం కనపడుతుంది. కానీ మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మధ్య స్ట్రాంగ్ గా కాంప్లిక్ట్స్ సీన్స్ పెట్టుకోలేదనిపిస్తుంది. సెకండాఫ్ లో రవితేజ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సైతం విక్రమార్కుడు గుర్తు చేసేలా ఇంట్రస్టింగ్ గా నడిపారు. ఆ ఎపిసోడే సెకండాఫ్ మొత్తం ఆక్రమించేసింది. రవితేజ ఎపిసోడ్ పూర్తగానే…క్లైమాక్స్ కు కథ వెళ్లిపోయింది క్లైమాక్స్ రొటీన్ కాకుండా ఉంటే బాగుండేది.

న‌టీ న‌టులు.. చిరంజీవి గెటప్, ఎక్స్ ప్రెష‌న్స్, మెగాస్టార్ ముఠా మేస్త్రి, మరికొన్ని మాస్ డ్యాన్స్‌ల జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. కలర్ ఫుల్ చొక్కా.. లుంగీ ధరించి.. మెడలో బంగారం గొలుసులు, చెవి పోగు, చేతికి గడియారం, బ్లాక్ బూట్స్.. ఇలా మాస్ అప్పీరియన్స్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు మెగాస్టార్. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ ఇలా అన్ని ఆ పాత్రకు ఫుల్ గా సెట్ అయ్యాయి. బాస్ పార్టీ సాంగ్ లో చిరంజీవి స్టెప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ర‌వితేజ విష‌యానికొస్తే..ఆయన కాకుండా ఆ క్యారక్టర్ వేరొకరు వేస్తే సినిమా వర్కవుట్ అయ్యేది కాదనే చెప్పాలి. తెలంగాణ యాసతో పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. చిరు, రవితేజల మధ్య వచ్చే ఎపిసోడ్స్ బాగున్నాయి.. శృతిహాసన్ రా ఆఫీసర్ గా తనదైన శైలిలో ఫైట్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ శృతి మించనివ్వకుండా బాగా వర్కవుట్ చేసారు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, ప్రదీప్ రావత్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఊర్వశి రౌతేలా డాన్స్ బాగుంది.

టెక్నికల్ గా .. తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారు ద‌ర్శ‌కుడు.కాగా తమ హీరోని మరింత గొప్పగా చూడాలనుకుని బాబి అనుకుంటే బాగుండేది. మెగాస్టార్ చిరంజీవిలోని కామిక్ యాంగిల్ మరోసారి ఎక్సప్లోర్ చేసే ప్రయత్నం మాత్రంం మెచ్చుకోదగ్గది. సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ ఈ సారి ఫెయిల్ కాలేదు. కాకపోతే చివరిలో వచ్చే సెంటిమెంట్ సాంగ్ మాత్రం ఇబ్బంది పెట్టింది. బాస్ పార్టీ, పూనకాల లోడింగ్, శ్రీదేవి, అందం ఎక్కువ వంటి పాటలు కు విజిల్స్ పడ్డాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన హార్బర్ సెట్ సూపర్బ్. రామ్ లక్ష్మణ్ ఫైట్స్…ఇంట్రవెల్ బ్లాక్ ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. నవీన్, రవిశంకర్ ప్రెస్టేజ్ గా తీసుకుని బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతుంది. ఎక్కడా లాగ్ లేకుండా బోర్ కొట్టనివ్వకుండా ఎడిట్ చేసి విధానం కూడా ప్లస్ అయ్యింది.మెగాస్టార్ ఫ్యాన్స్ మెచ్చే చిత్ర‌మిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement