Tuesday, November 26, 2024

బీచ్ ఒడ్డున నిద్ర‌పోయిన యువ‌తి-లేచి చూస్తే ప్లాస్టిక్ లా మారిపోయిన ముఖం

ఓ యువ‌తి బీచ్ ఒడ్డున సేద‌తీరుతుంది.అయితే ఏమ‌యిందో ఏమోకానీ ఆమె ముఖం ప్లాస్టిక్ ను వేడిచేస్తే ఎలా మారుతుందో అలా మారిపోయింది.ఈ యువ‌తి బ్యూటీషియన్ గా పనిచేస్తుంద‌ట‌. బ్రిటన్ కు చెందిన సిరిన్ మురాద్ (25) అనే యువతి నెల రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. విహారంలో భాగంగా ఓ ఫూల్ వద్ద కూర్చొని అక్కడ కాసేపు నిద్ర‌పోయింది. 30 నిమిషాల త‌ర్వాత మేల్కొన్న ఆమె .. నుదురు ..చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ పట్టించుకోకుండా మళ్లీ సీరియ‌స్ గా నిద్రపోయింది. అదే ఆమె కొంప ముంచింది.మరుసటి రోజు ఆమె ముఖం పై ఉన్న చర్మం కుచించుకుపోయి ప్లాస్టిక్ లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దానికి కారణమని ఆమె భావించింది. సన్ స్క్రీన్ లోషన్ కూడా తాను పెట్టుకోలేదని.. ఇలా ఎలా మారిందో అర్థం కావడం లేదని ఆ యువతి వాపోయింది.తాను బీచ్ లో నిద్రపోయిన సమయంలో కేవలం 21 డిగ్రీల ఎండమాత్రమే ఉందని.. ఏమైందో తెలియడం లేదని ఆ యువతి తెలిపింది. ఆస్పత్రికి కూడా వెళ్లేందుకు ముఖం చాలలేక సోషల్ మీడియాలో చెప్పుకుంటూ బాధపడింది. రోజులు గడిచే కొద్దీ ముఖంపై పగుళ్లు వచ్చినట్టు చెబుతోంది. నొప్పితో బాధ.. భయం వేస్తోందని చెప్పింది. ప్రస్తుతం కోలుకున్నట్టు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement