ప్రభన్యూస్: 5జీ ట్రయల్స్‌లో భాగంగా మహారాష్ట్రలోని పుణ, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రభుత్వం కేటాయించిన 5జీ స్పెక్ట్రమ్‌పై పలు రేంజ్‌ల 5జీ ఆధారిత టెక్నాలజీ సొల్యూషన్లను ప్రదర్శించినట్టు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్రకటించింది. ట్రయల్స్ దశలో ఉన్న 5జీతో భారత ప్రయాణాన్ని ఐదవ తరం వైర్‌లెస్ మొబైల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీకి చేర్చేందుకు తాము సిద్ధమవుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవిందర్ టక్కర్ తెలిపారు.
5జీ టెక్నాలజీ రేపటిని మెరుగ్గా మార్చుతుందన్నారు. ఎల్‌అండ్‌టీ స్మార్ట్ వరల్డ్ అండ్ కమ్యూనికేషన్, అథోనెట్, విజెబీ అండ్ ట్వీక్ ల్యాబ్స్‌తోపాటు టెక్నాలజీ దిగ్గజాలైన ఎరిక్సన్, నోకియాలతో కలిసి రెండు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించింది. 3.5 జీహెచ్‌జెడ్‌పై 1.5 జీబీపీఎస్ స్పీడ్, 26 జీహెచ్‌జెడ్‌పై 4.2 జీబీపీఎస్ స్పీడ్, ఈ-బ్యాండ్స్ స్పెక్ట్రమ్‌పై 9.8 జీబీపీఎస్ వరకు గరిష్ఠ స్పీడ్‌లను అందుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital