రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిత్రం ద కశ్మీర్ ఫైల్ . ఈ చిత్రంపై సాక్షాత్త్ ప్రధాని మోడీ కూడా ప్రసంశల వర్షాన్ని కురిపించారు. బాలీవుడ్ లోని ప్రముఖులు ఈ చిత్రాన్ని కొనియాడగా..పలువురు విమర్శించారు. దాంతో ద కశ్మీర్ పైల్స్ చిత్రం ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించింది. ఈ చిత్ర డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్ని హోత్రి కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ కీలక ప్రకటన చేశారు. ద ఢిల్లీ ఫైల్స్ పేరిట తన తదుపరి చిత్రాన్ని వివేక్ ప్రకటించారు. ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్… ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంతో ఇంకే రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారో అని బాలీవుడ్ సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్నారట. . కశ్మీరీ పండిట్ల సమస్యలపై చిత్రం తీసిన వివేక్.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోనన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ద్వారా ఏం చెప్పనున్నారో చూడాలి. మరి ఈసారి ఢిల్లీలో ఏ సంఘటనని ఆధారంగా చేసుకుంటాడో అని ఇప్పటికే పలువురు కలవరపడుతున్నారట.
Advertisement
తాజా వార్తలు
Advertisement