Tuesday, November 26, 2024

నూమాయిష్‌కు సందర్శకుల తాకిడి.. దాదాపు 46 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్‌..

ప్రభన్యూస్ : దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్‌ అయిన నుమాయిష్‌కు రోజు-రోజుకు సందర్శకులు పెరిగిపోతున్నారు. ఎందు కంటే గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ మహమ్మారి, ఇతరత్రా కారణాల వ‌ళ్ల పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమ్మకాలు లేవు. దీంతో గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎవరూ నష్టపోకుండా ప్రత్యేక ప్రణాళికతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 1500లకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయడంతో.. ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు నగరం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తుతున్నారు. ప్రతి రోజ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నుమాయిష్‌లో స్టాల్స్‌ ఉంటాయి. వీకెండ్స్‌లో రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండటంతో జనం అధికంగా సందర్శిస్తున్నారు.

తినుబండాల నుంచి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడానికి అధికంగా జనం ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జిబిషన్‌లో పిస్తాహౌజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాలిమ్‌ను సందర్శకులు అధికంగా రుచి చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ నెల నుంచిఎగ్జిబిషన్‌ సొసైటీ నుమాయిస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం జనవరి, 1 నుంచి ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతున్న సంగతి కూడా విధితమే. అయితే ఈ ఏడాది జనవరి, 1 నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ ప్రారంభమైన వెంటనే కొవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో ఎగ్జిబిషన్‌ను వాయిదా వేయడంతో మళ్లి తిరిగి ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement