విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ ఉంటుందని, 151మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపీలు ఉన్న వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించడం లేదని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో వైసీపీ ఉందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీకి తన బాధ్యతను గుర్తు చేసేలా డిజిటల్ క్యాంపెయిన్ ఉంటుందని చెప్పారు పవన్ కల్యాణ్. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కలిసిన రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..