స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. కాగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఈనెల 28న విశాఖ బంద్ నిర్వహిస్తున్నామని పరిరక్షణ సమితి నాయకులు వెల్లడించారు.స్టీల్‌ప్లాంట్ కొనసాగిస్తామనే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలని చూస్తే బీజేపీ దీపం ఆరిపోవడం ఖాయమన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వందమంది ఎంపీ సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడతామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి రూ. 5వేల కోట్లు పన్నులు ప్లాంట్‌కు చెల్లిస్తున్నామని నాయకులు వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తి కావస్తుందని వివరించారు. కేంద్రం రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..