Saturday, November 23, 2024

Russia-Ukraine war: రష్యాలో వీసా, మాస్టర్‌కార్డ్‌ సెవలు నిలిపివేత

ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యా పై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఆపిల్‌, శామ్‌సంగ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో కార్డ్ చెల్లింపు దిగ్గజాలు వీసా, మాస్టర్‌కార్డ్‌ చేరాయి. అమెరికాకు చెందిన పేమెంట్‌ సంస్థలైన వీసా, మాస్టర్​కార్డ్​.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేవలను ఆపేస్తామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు నిమిషాల వ్యవధిలో వచ్చిన ప్రత్యేక ప్రకటనలలో వెల్లడించింది. రష్యాలో విడుదల చేసిన వీకా కార్డులు.. ఆ దేశం వెలుపల, రష్యా బయట విడుదల చేసి కార్డులు ఆ దేశంలో మరికొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని అన్ని లావాదేవీలను నిలిపివేయడానికి తమ క్లయింట్లు, భాగస్వాములతో కలిసి పని చేస్తామని పేర్కొన్నాయి.

రష్యాతో అనుసంధానించబడిన వ్యాపారం నుండి ప్రతి కంపెనీ దాని నికర ఆదాయంలో 4% పొందుతుంది. U.S. చట్టసభ సభ్యులతో వీడియో కాల్ సందర్భంగా రష్యాలో అన్ని వ్యాపారాలను నిలిపివేయాలని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కంపెనీలకు పిలుపునిచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయాలు వచ్చాయి. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడు, కాలిఫోర్నియా డెమొక్రాట్ ప్రతినిధి బ్రాడ్ షెర్మాన్, ఉక్రేనియన్ నాయకుడితో ఏకీభవిస్తున్నట్లు కాల్ తర్వాత ట్వీట్ చేశారు. కాగా, ప్రముఖ మొబైల్‌ఫోన్‌ తయారీ సంస్థ అయిన శామ్‌సంగ్‌ కూడా రష్యాకు ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement