Saturday, November 23, 2024

ప్ర‌పంచంలోనే అతిపెద్ద హిందూ దేవాల‌యం – భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లీం వ్యాపార‌వేత్త‌

హిందూ ..ముస్లీం భాయి భాయ్ అనేది ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న నానుడి. అది మ‌రోసారి నిరూపిత‌మ‌యింది. బీహార్ లోకి ఓ ముస్లీం కుటుంబం రాష్ట్రంలోని తూర్పు చంపార‌న్ జిల్లాలోని కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం..విరాట్ రామాయణ్ మందిర్-నిర్మించడానికి రూ.2.5 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చింది.ఈ ప్రాజెక్టును చేపట్టిన పాట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిషోర్ కునాల్ స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద హిందూ దేవాల‌య నిర్మాణం గురించి వెల్ల‌డించారు. ఈ దేవాలయ నిర్మించ‌డానికి అందిన విరాళాలు వెల్ల‌డించారు. దేవాల‌య నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ గౌహతిలోని తూర్పు చంపారన్‌కు చెందిన వ్యాపారవేత్త.కేషారియా సబ్-డివిజన్ (తూర్పు చన్ంపరన్) రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆలయ నిర్మాణం కోసం తన కుటుంబానికి చెందిన భూమిని విరాళంగా ఇవ్వడానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను అతను ఇటీవలే పూర్తి చేసాడని మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి కునాల్ మీడియాతో అన్నారు.

ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ .. అతని కుటుంబం చేసిన ఈ విరాళం రెండు వర్గాల మధ్య సామాజిక సామరస్యం .. సోదరభావానికి గొప్ప ఉదాహరణ అని ఆచార్య అన్నారు. ముస్లింల సహాయం లేకుండా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సాకారం చేసుకోవడం కష్టమని ఆయన అన్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం మహావీర్ మందిర్ ట్రస్ట్ ఇప్పటివరకు 125 ఎకరాల భూమిని విరాళంగా పొందింది. ఈ ప్రాంతంలో ట్రస్టు త్వరలో మరో 25 ఎకరాల భూమిని కూడా పొందనుంది. విరాట్ రామాయణ మందిరం కంబోడియాలోని 12వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్కోర్ వాట్ కాంప్లెక్స్ కంటే 215 అడుగుల ఎత్తులో ఉంటుంది. తూర్పు చంపారన్‌లోని కాంప్లెక్స్ ఎత్తైన గోపురాలతో 18 ఆలయాలను కలిగి ఉంటుంది. దానిలోని శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్ర‌తిష్టించ‌నున్నారు. ఈ ఆల‌యం మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో నిమగ్నమైన నిపుణుల నుంచి ట్రస్ట్ ఆల‌య నిర్మాణం కోసం త్వరలో సలహాలు, సూచ‌న‌లు తీసుకోనుంది. ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement