ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో కింగ్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రన్ మిషన్ సెంచరీ కొట్టకుండానే 50 ఇన్నిగ్స్ లు పూర్తి చేశాడు. కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై (డే/నైట్ టెస్ట్) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అడపాదడపా అర్ధశతకాలు చేశాడు. కాని వాటిని సెంచరీలుగా మలుచలేకపోతున్నాడు కోహ్లీ. ఇప్పటి వరకూ టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి 70 శతకాలు సాధించిన కోహ్లి.. ఇంగ్లండ్ సిరీస్‌లోనైనా 71వ శతకాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అసలు విరాట్ కోహ్లీ టెస్టుల్లో కాని వన్డేల్లో గాని సగటున ఒ 4 ఇన్నింగ్స్ లకు ఓ సెంచరీ కొట్టేవాడు అలాంటిది..అన్ని ఫార్మాట్లో కలిపి 50 ఇన్నింగ్స్ లు ఆడిన ఓ సెంచరీ సాధించలేకపోతున్నాడు కోహ్లీ. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ఈ రన్ మెషీన్.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు.
లీడ్స్ వేదికగా బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 78 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (7) మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి ఆవల వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో కోహ్లిని అత్యధిక సార్లు(7) ఔట్ చేసిన బౌలర్‌గా ఆండర్సన్ రికార్డు నెలకొల్పాడు. కాగా, నేటి ఇన్నింగ్స్‌తో కోహ్లి శతక్కొట్టక 50 ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యాయి. మూడు ఫార్మాట్‌లలో కలిపి గడిచిన 50 ఇన్నింగ్స్‌లలో అతను మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. ఇందులో 18 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, 15 వన్డే ఇన్నింగ్స్‌లు, 17 టీ20 ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. దీంతో మూడో టెస్టుతో కోహ్లి హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీ 71 సెంచరీ చేయడం ఓ కలగా మిగిలిపోనుంది.. అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇది ఏడవసారి: కోహ్లీ వికెట్ మళ్లీ అండర్సన్ కే..