పాకిస్తాన్‌లోని కరాచీ సిటీ అంతుపట్టని వైరల్ జ్వరాలతో వణికిపోతోంది. ఈ జ్వరాలు స్పీడ్‌గా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డెంగ్యూ జ్వరం వల్లనే రోగుల్లో ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే డెంగ్యూ లక్షణాలు ఉండటంతో బ్లడ్ టెస్టులు చేస్తే రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ తెలిపారు.
రెండు వారాలుగా కరాచీలో డెంగ్యువంటి కొత్తరకం వైరల్ ఫీవర్లతో జనం హాస్పిటళ్లకు వస్తున్నారని.. నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, హేమాటో పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు తెలిపారు. కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధ్రువీకరించారు. ఈ వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉన్నాయి కానీ డెంగ్యూ ఫీవర్స్ కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్‌లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డెంగ్యూ జ్వరం కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఈ కొత్త వైరల్ ఫీవర్ వల్ల కరాచీ నగరంలో ప్లేట్‌లెట్ల మెగా యూనిట్లు కొరత ఏర్పడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily