Saturday, November 23, 2024

జిల్లాను వణికిసున్న విషజ్వరాలు.. వాతావరణంలో మార్పులతో వైరల్ ఫీవ‌ర్..

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. విషజ్వరాలు విజృంభించడంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు విషజ్వరాల బారినపడుతున్నారు. సీజనల్‌ జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్న నేపథ్యంలో జ్వరమొస్తే కరోనానేమో అనే భయంతో వణికిపోతున్నారు. ఒమెక్రాన్‌ ప్రారంభ లక్షణాలకు పోలి ఉండడంతో ప్రజలు భయం భ్రాంతులకు గురైతున్నారు.

ఇటీ వల అకాల వర్షాలు, చలిగాలులు, వాతావరణంలో మార్పులతో వైరల్‌ జ్వరాలు సోకుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సాధారణ జ్వరం వచ్చినా కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావైద్య ఆరోగ్యశాఖ ఫీ వర్‌ సర్వే కింది ఇప్పటికి 80 శాతం ఇళ్ల సర్వే పూర్తి చేయగా కేవలం 870 మంది అనుమానితులను గుర్తించడం గమనార్హం. ప్రతి ఇంటిలో విషజ్వరాలతో బాధపడుతున్న వారుంటే ఫీవర్‌ సర్వే వాస్తవాలకు భిన్నంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement