టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకున్నారు. వినోద్ కాంబ్లీకి కేవైసీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అని , కేవైసీని అప్ డేట్ చేసుకోవాలని కోరాడు. దాంతో అతని వివరాలు తెలుసుకోకుండానే అతను పంపిన లింకులను క్లిక్ చేసి వివరాలు పంపాడు వినోద్ కాంబ్లీ. దాంతో తక్షణమే కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.13 లక్షలు మాయమయ్యాయి. దాంతో విషయం తెలుసుకున్న కాంబ్లీ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తి నుంచి వరుసగా ఫోన్లు రావడం వల్లే వివరాలను ఇచ్చానని చెప్పాడు. కాంబ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో వినోద్ కాంబ్లీ : అకౌంట్ నుంచి రూ. 1.13లక్షలు మాయం
Advertisement
తాజా వార్తలు
Advertisement