Tuesday, November 19, 2024

పల్లె ప్రగతిలో మంత్రులకు నిరసన సెగ… హరీశ్‌‌ను నిలదీసిన మహిళలు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో మొదటి రోజే నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం ప్రారంభమైన గ్రామసభల్లో ప్రజాప్రతినిధులను, అధికారులను సమస్యలపై ప్రజలు నిలదీశారు. పలు ప్రాంతాల్లో మంత్రులను చేదు అనుభవం ఎదురైంది. మొదటి రోజే గ్రామాల్లోనిరసన సెగ తలగడం టీఆర్ఎస్ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామంలో మంత్రి హరీశ్‌‌‌‌ రావుకు చేదు అనుభవం ఎదురైంది. పల్లె ప్రగతి గ్రామ సభలో మహిళలు సమస్యలపై గొంతెత్తారు. దీంతో ప్రసంగం ముగించుకుని హరీశ్‌‌‌‌ రావు వెళ్లిపోతుండగా.. కొంత మంది మహిళలు ఆయన వెనుకే వెళ్లారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లాలో విద్యుత్ మంత్రి జగదీశ్ ​రెడ్డి సొంత గ్రామం నాగారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎంపీపీ, సర్పంచ్​లపై స్థానికులు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కొత్తగా నిర్మించబోతున్న రాచకొండ కమిషనరేట్​లో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతిని దళిత రైతులు అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేను సైతం గ్రామాల్లో ప్రజలు సమస్యలపై నిలదీశారు.

ఇది కూడా చదవండి: మల్లన్నసాగర్‌కు కాళేశ్వరం నీళ్లు: మంత్రి హరీష్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement