Tuesday, November 26, 2024

క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ మూవీ రివ్యూ – ఎలా ఉందంటే

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం విక్ర‌మ్. ఈ చిత్రం నేడు థియేట‌ర్స్ లో రిలీజ్ అయింది. మ‌రి ఈ చిత్రం క‌మ‌ల్ కి విజ‌యాన్ని అందించిందా లేదా తెలుసుకుందాం..

కథ..విక్ర‌మ్ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటు ఫహద్ ఫాజిల్.. విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి నటులు కూడా సాలిడ్ రోల్స్ లో చేయడం వీటిని మించి ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంగా స్టార్ హీరో సూర్య కూడా భాగం కావడంతో ఓ రేంజ్ లో హైప్ ఈ సినిమాపై నెలకొంది..ఈ నటులు అద్భుతంగా రాణించగా తన సినిమా “ఖైదీ” కి లింక్ చెయ్యడం కనిపించాయని అంటున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ లు చాలా కొత్తగా అనిపిస్తాయట‌. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక లెవెల్లో ఉందని టాక్.ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, కమల్ క్యారెక్టర్లను చూపిన తీరు అదిరిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత ల్యాగ్ ఉన్నట్లుగా అనిపిస్తుందని తెలిసింది. క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని పబ్లిక్ టాక్..ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ సమయమే ఉంటుందట. ఒక సందర్భంలో అసలు ఇది కమల్ సినిమానేనా అని సందేహం వస్తుందట. అయితే, సెకెండాఫ్‌లో మాత్రం ఆ లోటును భర్తీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఎవరికీ వారే అన్నట్లు కథకు తగ్గట్లు నటించారు.. ఇప్పటివరకు అందుతున్న టాక్ ప్రకారం కమల్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు..

ఐదు దశాబ్దాల కమల్ హాసన్ కెరీర్‌లో తొలిసారిగా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా విక్రమ్. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి కొన్నారు. విక్రమ్ సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. కమల్ హాసన్ రాసి పాడిన పాతాళ పాతాలా పాట సూపర్ హిట్. ఈమూవీ స్టార్ట్ అయన అప్పటి నుంచీ .. ఫ్యాన్స్ కమల్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ముఖ్యంగా, సినిమా కథ ఇద్దరు తోబుట్టువులు- ఒక గ్యాంగ్‌స్టర్ మరియు రాజకీయ నాయకుడు- ప్రభుత్వ అధికారిని కిడ్నాప్ చేయడం. ఒక రిటైర్డ్ పోలీసు అధికారి, విక్రమ్ వారిని కాపాడం ఇలా సాగుతుంది.

న‌టీ న‌టులు..కమల్ హసన్ గురించి ప్రత్యేకంగ చెప్పేది ఏముంది.. ఆయన క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంది. ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ కి మ‌రో హిట్ట్ ప‌డిన‌ట్టే..కమల్ హాసన్ ను ఇంత అద్భుతంగా చూపిస్తాడని అనుకోలేదు . ఇక అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మెస్మరైజ్ అయ్యేలా ఉంది. మొత్తానికి విక్రమ్ సినిమా.. కమల్ ఫ్యాన్స్ కు పండగ..మ‌రి క‌లెక్ష‌న్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement