లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీఎస్టీ సూపరింటెండ్ అధికారులు. దాంతో వారిని అరెస్ట్ చేశారు. సకాలంలో పన్నులు చెల్లించని వ్యాపారుల నుండి జీఎస్టీ సూపరింటెండ్ జాన్ మోషన్ లంచాన్ని డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యాపారస్తులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కాగా హైదరాబాద్ బషీర్ బాగ్ జీఎస్టీ కార్యాలయంలోని కస్టమ్స్ యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను సిబిఐ అరెస్ట్ చేసింది.
ఓ వ్యాపారి నుండి లంచం తీసుకొన్నారని వీరిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది.కస్టమ్స్ యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల తర్వాత కిషన్ పాల్, సురేష్ లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది సీబీఐ. వీరిద్దరూ లంచం తీసుకొన్నారని సీబీఐ నిర్ధారణ చేసుకొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..