Saturday, November 23, 2024

ఏపీలో లాక్ డౌన్.. వ్యాపారస్థులు నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ పై కరోనా కేసులు ఆందోళన కలిగిసతున్నాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఆరు వేల మార్కును దాటింది. తొలి దశ కంటే సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. అదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం అందరిలో ఆందోళన పెంచుతోంది. దీంతో చాలా చోట్ల వ్యాపారస్తులే స్వచ్చంధ లాక్ డౌన్ కు ముందుకు వస్తున్నారు. తాజాగా విజయవాడ ఛాంబెర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా వ్యాపారస్థులు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక ప్రకటన విడుదుల చేసింది. దీనిలో భాగంగా విజయవాడ చాంబర్ లో అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు అధ్యక్షతన అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై సుదీర్ఘంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిలో భాగంగా ఈ ఆదివారం అంటే 18వ తేదీన విజయవాడలో ఉన్న వ్యాపార సంస్తలు అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక, సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలని.. తరువాత ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని నిర్ణయించారు. విజయవాడ చాంబర్స్ ఆఫ్ కామర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వ్యాపారా, వాణిజ్య సంస్థలు యథావిథిగా పాటించాలని అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు కోరారు. అలాగే, కరోనా కట్టడిలో భాగంగా ప్రతి వ్యాపార సంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, షాపులు, వ్యాపార సముదాయల దగ్గర తప్పకుండా శానిటేషన్ చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అందరూ భౌతిక దూరం పాటించి రక్షణ పొందాలిన కోరారు. వినియోగదారులు కూడా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోవద్దని, ఈ విషయంలో వ్యాపారులు వినియోగదారులను చైతన్యవంతులను చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement