తెలంగాణలో అభివృద్ది జరగాలంటే ప్రజాప్రతినిధుల రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు విజయశాంతి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి మండి పడ్డారు. రాజీనామాల కోసం, ఉపఎన్నికల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్ళిన ఈ అప్పుల, ఆస్తుల అమ్మకాల సీఎం గారు భవిష్యత్తులో తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో అన్న ఆందోళన అందరిలోనూ ఏర్పడుతున్నది. ” అంటూ విజయశాంతి మండిపడ్డారు.
ఇక ”పీసీసీ అధ్యక్షులు, టీఆరెస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని…మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే…. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆరెస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఎన్నికల అవసరం లేకుంటే కేసీఆర్ గారు ప్రజల ముఖం కూడా చూడరన్న బలమైన నమ్మకం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉండటం ఇందుకు కారణం కావచ్చు. ఇంకా తెలంగాణలో ప్రజాప్రతినిధులను రాజీనామాలకై అనేక నియోజకవర్గాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయని విజయశాంతి అన్నారు.
ఇది కూడా చదవండి: రేప్ చేసిన వాడు భవిష్యత్ ఆస్తి ఎలా అవుతాడు?: బాధితురాలు