ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు అంశంపై చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన కలిసిపోటీ చేస్తాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యలో తాజాగా ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
‘రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ. నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలే’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఒక కార్యకర్త చూచించగా… వన్ సైడ్ లవ్ మంచిది కాదని చంద్రబాబు చమత్కారంగా చెప్పాడు. టూ సైడ్ లవ్ అయితేనే నిలబడుతుందని టీడీపీ, జనసేన పొత్తుపై నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ మాటలే ప్రత్యర్థి పార్టీల నేతలకు అస్త్రాలుగా మారాయి.