Saturday, November 23, 2024

గుజరాత్ కొత్త సీఎం ఎవరు?

గుజరాత్​ ముఖ్యమంత్రి పదవికి విజయ్​ రూపానీ రాజీనామా చేసిన క్రమంలో తదుపరి సీఎం ఎవరనే విషయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రూపానీ రాజీనామా చర్చనీయాంశమైంది. హ్మదాబాద్​ సర్దార్​ధామ్​ భవన్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్​గా పాల్గొనగా.. రూపానీ కూడా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే రూపానీ రాజీనామా చేయడం గమనార్హం. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ నాయకులతో సీనియర్​ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురి పేర్లును అధిష్ఠానం పరిశీలిస్తోంది. 2022 డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటేల్​ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర డిప్యూటీ నితిన్​ పటేల్​, కేంద్ర మంత్రులు పురుషోత్తమ్​ రుపాలా, మాన్సుఖ్​ మాండవియాలు సీఎం పదవి రేసులో ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రి పేరును ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండిః గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement