తమిళ స్టార్ హీరో విజయ్ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులంతా వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు తన అభిమాన సంఘం ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్’ సభ్యులకు విజయ్ అనుమతిచ్చాడు. వీరంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అంతేకాదు ప్రచార సమయంలో తన ఫొటోలను ఉపయోగించుకోవడానికి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫిబ్రవరి 19న పట్టణ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్త చర్చ ప్రారంభమైంది. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి విజయ్ దిగే అవకాశం ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..