విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో దర్శకుడు బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కి ‘హత్య’ అనే టైటిల్‌ను పెట్టినట్టుగా ప్రకటించారు. ఈ థ్రిల్లర్ మూవీలో విజయ్ ఆంటోనీ డిటెక్టివ్‌గా కనిపించనున్నారట, విజయ్ జంటగా నటి రితికా సింగ్ సంధ్య పోలీస్‌గా నటిస్తోంది, లోటస్ పిక్చర్స్‌కు అండ్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్‌కి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా 1923లో జరిగిన హత్య కేసు ఆధారంగా తెరకెక్కనుందట. విజయ్ ఆంటోని మరియు రితికా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ఇతర స్టార్ కాస్ట్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్ మరియు సంకిత్ బోహ్రా తదితరులు ఉన్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివకుమార్ విజయన్ ఫోటోగ్రఫీ దర్శకుడు.
ఈ కథ లీలా అనే అందమైన మోడల్ గురించి, ఆమె అప్ స్కేల్ అపార్ట్మెంట్లో హత్యకు గురైంది. వ్యక్తిగత సమస్యల వల్ల ఫీల్డ్ వర్క్ నుండి సస్పెండ్ చేయబతాడు డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోని) ఈ మిస్టరీని ఛేదించడానికి తిరిగి వర్క్ లో జాయిన్ అవుతాడు. ఆ కేసును ఛేదించడానికి అతనికి సంధ్య (రితికా సింగ్) సహాచం చేస్తోంది.