లా చదివి ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత మోడలింగ్ రంగంవైపు పయనించింది విద్యా మాల్వాదే. ఆపై పలు చిత్రాల్లో నటించింది. ముందుగా యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ విద్యాని పలు యాడ్స్ కోసం తీసుకున్నారు. 2003లో ఇంతేహా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందీ భామ. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెరిసింది. ఆమె మొదటి భర్త కెప్టెన్ అరవింద్ సింగ్ బగ్గా. అలయన్స్ ఎయిర్ లో పైలట్. కాగా అతను పాట్నాలోని భవనంపై ప్లైట్ కూలిపోవడంతో మరణించాడు. ఆ తరువాత విద్యా మాల్వాదే ఆస్కార్ అవార్డ్-నామినేట్ అయిన లగాన్ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ ,అసోసియేట్ డైరెక్టర్గా అశుతోష్ గోవారికర్తో కలిసి పనిచేసిన సంజయ్ దయామాను వివాహం చేసుకుంది. నిత్యం ఫిట్ గా ఉండేందుకు ఇష్టపడే విద్యా తాను యోగా చేస్తోన్న ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఆమె వయసు ఇప్పుడు 48. అయినా తన ఒళ్ళుని విల్లులా వంచుతూ యోగాసనాలు వేయడం నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..