ప్రతి మనిషికి ఓ కల ఉంటుంది. దాన్ని కొందరు నిజం చేసుకోవడానికి ఏ సాహసానయినా చేస్తారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి
తన జీవితకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ శునకంలా మారిపోయాడు. వినడానికి, నమ్మడానికి కాస్తంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం. సోషల్ మీడియాలో ఇప్పుడా ‘శునకం’ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి… జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం శిల్పాలను తయారుచేస్తూ ఉంటుంది. మస్కట్ పాత్రల దుస్తులను కూడా డిజైన్ చేస్తుంది. ఇటీవల ఆ సంస్థను ఆశ్రయించిన టోకో ఇవీ అనే వ్యక్తి తాను శునకంలా కనిపించాలనుకుంటున్నానని చెప్పాడు. ఇందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదన్నాడు. అందుకు అంగీకరించిన జెప్పెట్.. 40 రోజులపాటు కష్టపడి అతడిని కోలీ జాతి శునకంలా మార్చేసింది. మేకప్, ఇతర ఖర్చుల నిమిత్తం టోకో 2 మిలియన్ యెన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 లక్షలు) సమర్పించుకున్నాడు. అయితే, ఈ శునకం అవతారంలో ఎన్ని రోజులు ఉంటానన్న విషయాన్ని అతడు వెల్లడించలేదు. తాను శునకంలా మారిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేయగా, ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
రూ.12లక్షలతో శునకంలా మారిన వ్యక్తి -వైరల్ గా వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement